ఆచార్య చాణక్యుడి బోధనలు ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, వ్యూహకర్త, రాజకీయ సలహాదారుగా చాణక్యుడికి మంచి పేరు ఉంది. ఆయన రచించిన ‘చాణక్య నీతి’లో జీవితం, సంబంధాలు, నాయకత్వం, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరించారు. కొన్ని పరిస్థితుల్లో ఒక ప్రదేశం లేదా వ్యక్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగాలని చాణక్య నీతి సూచించినట్లు చెబుతారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం దీనికి కొన్ని ప్రతీకాత్మక, మానసిక కారణాలను కూడా చెబుతారు.

