ప్రభన్యూస్

Electricity Bill: కరెంట్ బిల్లు చేతితో పట్టుకుంటే మటాషేనా.. ప్రాణాంతక వ్యాధి వస్తుందా? | లైఫ్ స్టైల్


Last Updated:

మనం రోజూ తాకే ఈ చిన్న కాగితం ముక్కతో ప్రాణాలకే ప్రమాదమా? వైద్యుల సంచలన హెచ్చరిక!

Electricity Bill: కరెంట్ బిల్లు చేతితో పట్టుకుంటే మటాషేనా.. ప్రాణాంతక వ్యాధి వస్తుందా?
Electricity Bill: కరెంట్ బిల్లు చేతితో పట్టుకుంటే మటాషేనా.. ప్రాణాంతక వ్యాధి వస్తుందా?

కరెంట్ బిల్లు కట్టడానికి వెళ్లారా? షాపింగ్ మాల్ లో వస్తువులు కొని బిల్ తీసుకున్నారా? ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు తీసి రసీదు చేత్తో పట్టుకున్నారా? అయితే మీరు తెలియకుండానే పెద్ద ప్రమాదంలో పడ్డట్లే! మనం రోజూ చూసే ఈ చిన్న కాగితం ముక్కల వల్ల భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఒక వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజమేనని ప్రముఖ వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ వైద్యుడు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా ఈ సంచలన విషయాలను వెల్లడించారు. కరెంట్ బిల్లులు, ఏటీఎం రసీదులు, మాల్స్ ఇచ్చే బిల్లులను సాధారణ కాగితాలపై కాకుండా థర్మల్ పేపర్‌పై ప్రింట్ చేస్తారు. ఈ థర్మల్ పేపర్లను తరచుగా నేరుగా చేతులతో తాకడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. క్యాన్సర్ వస్తుందంటూ ఆయన చేసిన ఈ తాజా పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇతరులను అప్రమత్తం చేస్తున్నారు.

ఈ కాగితాల్లో ఉండే ప్రమాదకర రసాయనాలే ఈ భయంకరమైన పరిస్థితికి కారణమని డాక్టర్ విక్రాంత్ తన వీడియోలో వివరంగా చెప్పారు. థర్మల్ పేపర్ల తయారీలో ప్రధానంగా బీపీఏ (BPA), బీపీఎస్ (BPS) లాంటి అత్యంత హానికరమైన రసాయనాలను విరివిగా ఉపయోగిస్తారు. వీటిని తరచుగా చేతితో తాకడం వల్ల ఆ రసాయనాలు చర్మం రంధ్రాల ద్వారా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ అసమతుల్యత కారణంగా భవిష్యత్తులో సంతానలేమి సమస్యలు తలెత్తుతాయని, దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఆయన విశ్లేషించారు.

ఇది కూడా చదవండి: Heavy Rains: ఈ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వాయుగుండం!

వృత్తిరీత్యా లేదా రోజువారీ విధుల్లో భాగంగా ఈ థర్మల్ బిల్లులను పదేపదే తాకే వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. రోజంతా ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇచ్చేవారు, సూపర్ మార్కెట్ క్యాషియర్లు తప్పనిసరిగా ప్రత్యేకమైన గ్లోవ్స్ వాడాలి. అయితే ఇక్కడ మరొక ప్రాణాపాయకరమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఏదైనా కలుషితమైన వస్తువును తాకగానే చేతులను శానిటైజ్ చేసుకోవడం అందరికీ అలవాటు. కానీ థర్మల్ పేపర్లను తాకిన వెంటనే పొరపాటున కూడా శానిటైజర్ వాడకూడదు. శానిటైజర్‌లో ఉండే ఆల్కహాల్ కారణంగా రసాయనాలు మరింత వేగంగా చర్మంలోకి ఇంకిపోయి క్యాన్సర్ ప్రమాదం రెట్టింపు అవుతుందని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Business Idea: కుందేలు బొచ్చుతో నెలకు రూ. 2 లక్షల సంపాదన.. అదిరే బిజినెస్ ఐడియా!

ఆధునిక జీవనశైలిలో ఈ బిల్లులను పూర్తిగా నివారించడం కష్టమే అయినా, కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ముప్పు నుంచి సులభంగా బయటపడొచ్చు. వీలైనంత వరకు ఈ కాగితపు బిల్లులకు బదులుగా డిజిటల్ రూపంలో రసీదులు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. పేపర్ బిల్లులు తప్పనిసరిగా తాకిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది మంచి సమాచారం అందించారని డాక్టర్‌ను సమర్థిస్తే.. ఇంకొంత మంది దేని ఆధారంగా మీరు ఇలా చెప్పారో సోర్స్ వెల్లడించాలని కోరుతున్నారు.

డిస్‌క్లేమర్.. కాగా పైన పేర్కొన్న సమాచారం కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్టర్ అభిప్రాయాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న కథనాల ఆధారంగా మాత్రమే అందించాం. ఇది ప్రజల కనీస అవగాహన కోసం మాత్రమే. ఈ సమాచారాన్ని మేము శాస్త్రీయంగా ధృవీకరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఎంతో సురక్షితం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 September 2026, 1:24 pm Digital Edition : Prabhanews
Electricity Bill: కరెంట్ బిల్లు చేతితో పట్టుకుంటే మటాషేనా.. ప్రాణాంతక వ్యాధి వస్తుందా? | లైఫ్ స్టైల్

Last Updated:Sep 21, 2026 1:14 PM ISTమనం రోజూ తాకే ఈ చిన్న కాగితం ముక్కతో ప్రాణాలకే ప్రమాదమా? వైద్యుల సంచలన హెచ్చరిక!Electricity Bill: కరెంట్ బిల్లు చేతితో పట్టుకుంటే మటాషేనా.. ప్రాణాంతక వ్యాధి వస్తుందా?కరెంట్ బిల్లు కట్టడానికి వెళ్లారా? షాపింగ్ మాల్ లో వస్తువులు కొని బిల్ తీసుకున్నారా? ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు తీసి రసీదు చేత్తో పట్టుకున్నారా? అయితే మీరు తెలియకుండానే పెద్ద ప్రమాదంలో పడ్డట్లే! మనం రోజూ చూసే ఈ చిన్న కాగితం ముక్కల వల్ల భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఒక వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజమేనని ప్రముఖ వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.ప్రముఖ వైద్యుడు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా ఈ సంచలన విషయాలను వెల్లడించారు. కరెంట్ బిల్లులు, ఏటీఎం రసీదులు, మాల్స్ ఇచ్చే బిల్లులను సాధారణ కాగితాలపై కాకుండా థర్మల్ పేపర్‌పై ప్రింట్ చేస్తారు. ఈ థర్మల్ పేపర్లను తరచుగా నేరుగా చేతులతో తాకడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. క్యాన్సర్ వస్తుందంటూ ఆయన చేసిన ఈ తాజా పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇతరులను అప్రమత్తం చేస్తున్నారు.ఈ కాగితాల్లో ఉండే ప్రమాదకర రసాయనాలే ఈ భయంకరమైన పరిస్థితికి కారణమని డాక్టర్ విక్రాంత్ తన వీడియోలో వివరంగా చెప్పారు. థర్మల్ పేపర్ల తయారీలో ప్రధానంగా బీపీఏ (BPA), బీపీఎస్ (BPS) లాంటి అత్యంత హానికరమైన రసాయనాలను విరివిగా ఉపయోగిస్తారు. వీటిని తరచుగా చేతితో తాకడం వల్ల ఆ రసాయనాలు చర్మం రంధ్రాల ద్వారా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ అసమతుల్యత కారణంగా భవిష్యత్తులో సంతానలేమి సమస్యలు తలెత్తుతాయని, దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఆయన విశ్లేషించారు.ఇది కూడా చదవండి: Heavy Rains: ఈ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వాయుగుండం!వృత్తిరీత్యా లేదా రోజువారీ విధుల్లో భాగంగా ఈ థర్మల్ బిల్లులను పదేపదే తాకే వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. రోజంతా ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇచ్చేవారు, సూపర్ మార్కెట్ క్యాషియర్లు తప్పనిసరిగా ప్రత్యేకమైన గ్లోవ్స్ వాడాలి. అయితే ఇక్కడ మరొక ప్రాణాపాయకరమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఏదైనా కలుషితమైన వస్తువును తాకగానే చేతులను శానిటైజ్ చేసుకోవడం అందరికీ అలవాటు. కానీ థర్మల్ పేపర్లను తాకిన వెంటనే పొరపాటున కూడా శానిటైజర్ వాడకూడదు. శానిటైజర్‌లో ఉండే ఆల్కహాల్ కారణంగా రసాయనాలు మరింత వేగంగా చర్మంలోకి ఇంకిపోయి క్యాన్సర్ ప్రమాదం రెట్టింపు అవుతుందని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: Business Idea: కుందేలు బొచ్చుతో నెలకు రూ. 2 లక్షల సంపాదన.. అదిరే బిజినెస్ ఐడియా!ఆధునిక జీవనశైలిలో ఈ బిల్లులను పూర్తిగా నివారించడం కష్టమే అయినా, కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ముప్పు నుంచి సులభంగా బయటపడొచ్చు. వీలైనంత వరకు ఈ కాగితపు బిల్లులకు బదులుగా డిజిటల్ రూపంలో రసీదులు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. పేపర్ బిల్లులు తప్పనిసరిగా తాకిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది మంచి సమాచారం అందించారని డాక్టర్‌ను సమర్థిస్తే.. ఇంకొంత మంది దేని ఆధారంగా మీరు ఇలా చెప్పారో సోర్స్ వెల్లడించాలని కోరుతున్నారు.డిస్‌క్లేమర్.. కాగా పైన పేర్కొన్న సమాచారం కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్టర్ అభిప్రాయాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న కథనాల ఆధారంగా మాత్రమే అందించాం. ఇది ప్రజల కనీస అవగాహన కోసం మాత్రమే. ఈ సమాచారాన్ని మేము శాస్త్రీయంగా ధృవీకరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఎంతో సురక్షితం.మరింత చదవండి

Source link