Last Updated:
Panipuri Ganpati: పూణెలో వెరైటీ గణేష్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారాడు. విచిత్రం ఏమిటంటే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే పానీ పూరీలతో ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం విశేషంగా చెప్పుకోపచ్చు.
Panipuri Ganpati: వినాయకచవితి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా పండగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. భక్తులు గణేష్ మహరాజ్‌పై ఉన్న భక్తిని చాటుకుంటూ వినూత్నమైన గణపతి విగ్రహాలను ప్రతిష్టించి చవితి నవరాత్రులను జరుపుకుంటున్నారు. అయితే దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వివిభ రూపాల్లో గణనాథులు దర్శనమిస్తున్నారు. కాని మహరాష్ట్రలోని పూణెలో వెరైటీ గణేష్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారాడు. విచిత్రం ఏమిటంటే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే పానీ పూరీలతో ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం విశేషంగా చెప్పుకోపచ్చు. ఇకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌తో ఈ విగ్రహాన్ని తయారు చేయడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
ప్రతీ ఏడాది దేశంలో అనేక ప్రాంతాల్లో వేర్వేరు రూపాల్లో గణపతి విగ్రహాలను నెలకోల్పుతున్నారు. చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే మహరాష్ట్రలో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పుణెలోని ఎఫ్‌సీ రోడ్డులోని ‘గణేశ్ భేల్’ నిర్వాహకులు పానీ పూరి బప్పాను ఏర్పాటు చేశారు. ఈ పానీ పూరీ గణేష్ విగ్రహం తయారు చేయడం కోసం సుమారు 21,000 పానీపూరీలను ఉపయోగించి 13 అడుగుల ఎత్తులో నిర్మించారు. రూపేశ్, దినేశ్ గుడ్మెవార్ అనే ఔత్సాహికులు 2 నెలలు కష్టపడి పానీ పూరీలతో వినాయకుడి రూపానికి ప్రాణం పోశారు. చవితి 9 రోజుల పాటు ఈ విగ్రహం పాడవకుండా ఉండేందుకు, దాని భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కళాకారులు నిరంతరం అక్కడే అందుబాటులో ఉంటున్నారు.
కేవలం ఆహార పదార్థాలతోనే కాదు, ఇతర వస్తువులతోనూ వినూత్న విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. చెన్నైలోని కొళత్తూర్‌లో 12,000 తెల్ల శంఖాలను ఉపయోగించి ఓ భారీ గణేశుడి విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఇది కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం, 3.84 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన ఓ విగ్రహం హైదరాబాద్ బేగంబజార్‌లో ప్రతిష్టించారు.
గణేష్ విగ్రహాలతో పాటు గణనాథుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం మోదకాల్లోనూ ఈ కొత్తదనం కనిపిస్తోంది. నాసిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్లో ఉన్న ‘సాగర్ స్వీట్స్’ వారు ‘గోల్డెన్ మోదకం’ను ఆవిష్కరించారు. తినేందుకు వీలైన బంగారు పూతతో తయారు చేసిన ఈ మోదకాల కిలో ధర అక్షరాలా రూ. 27,000 పలుకుతోంది. ఈ స్వీట్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తం మీద పానీపూరీ గణపతి నుంచి బంగారు మోదకాల వరకు చవితి ఉత్సవాల్లో నయా ట్రెండ్ సృష్టించడానికి భక్తులు వేర్వేరు ప్రయోగాలు చేసి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

